Friday, March 13, 2026

నకిలీ వీసా ఇచ్చి మోసం చేసిన కేసులో గల్ఫ్ ఏజెంట్ కు మూడేళ్ల జైలుశిక్ష, రూ. 1000 ల జరిమాన

నేటి సాక్షి, జగిత్యాల బ్యూరో : గల్ఫ్ పంపిస్తానని డబ్బులు తీసుకొని నకిలీ వీసా ఇచ్చి మోసం చేసిన కేసులో గల్ఫ్ ఏజెంట్ కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష తోపాటు రూ.1000 జరిమానాను కూడా విధించింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగోజిపేట గ్రామానికి చెందిన రాపల్లి నాగేష్ కు నిజామాబాద్ జిల్లా పిప్పరి మండలం, భీమ్ గల్ గ్రామానికి చెందిన ఎగోలము మనోజ్ కుమార్ తో దుబాయ్ లో పరిచయం ఏర్పడింది. మనోజ్ తన దగ్గర దుబాయి దేశానికి చెందిన అలి – కో కంపెనీకి చెందిన వీసాలు ఉన్నాయని నమ్మించి రాపల్లి నాగేష్ మరియు అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురి దగ్గర ఒక్కొక్కరి దగ్గర రూ. 40,000 ల చొప్పున మొత్తం రూ. 2,40,000 ల నగదు తీసుకొని నకిలీ వీసాలు ఇచ్చారు. తమకు ఇచ్చిన వీసాలు నకిలీవని గమనించిన రాపల్లి నాగేష్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో నిందితుడు ఏగోలం మనోజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మేడిపల్లి పోలీసులు కేసు విచారణలో భాగంగా కోరుట్ల జుడీష్యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పావని సాక్షులను విచారించారు.అనంతరం నిందితుడు మనోజ్ కుమార్ కు 3 సంవత్సరాలు జైలు శిక్ష తోపాటు 1000 రూపాయల జరిమానాను కూడా విధిస్తున్నట్టు తీర్పునిచ్చారు. ఈ కేసులో ఏపీపీ గా ప్రణయ్ కుమార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎస్సైలు శ్యామ్ రాజ్, వి. వెంకటేశ్వర్ రావు ,సీఎం ఎస్ ఎస్సై శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ మహేశ్వర్, నిందితునికి శిక్ష పడడంలో కోర్టుకు సాక్షాధారాలు అందించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేసులో నిందితునికి జైలు శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News