నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలోని మున్సిపల్ లో శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ముజీబ్ ను మంగళవారం పాలకవర్గ పదవి విరమణ ఆత్మీయ కార్యక్రమంలో భాగంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్, చైర్ పర్సన్ రణవేణి సుజాత మాట్లాడుతు.. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని పట్టణాన్ని గతంలో కంటే పారిశుద్ధ్య పనులలో మెరుగుపరిచారని ఈయనను ఆదర్శంగా తీసుకొని ఇతర ఉద్యోగులు పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, మున్సిపల్ కమిషనర్ మోహన్, డిఈ నాగేశ్వరరావు, మేనేజర్ వెంకటలక్ష్మి, మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.





