
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణ మొదలైనవి. ఇందులో భాగంగా మండలంలోని చర్లపల్లి తో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేక అధికారులు, పంచాయితీ కార్యదర్శుల ఆద్వర్యంలో మంగళవారం ప్రజా పాలన గ్రామ సభలు ఏర్పాటుచేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇదివరకు ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ధరఖాస్తుదారులను క్షేత్రస్థాయిలో సందర్శించి పథకాల వారిగా రూపొందించిన అర్హుల ముసాయిదా జాబీతాను గ్రామ సభల వేదికగా ప్రకటించి ప్రభుత్వ సంకల్పం, పథకాల అమలు తీరును వివరించి ప్రజల అమోదంతో జాబీతాను పైస్థాయికి సిఫార్సు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా చర్లపల్లి ప్రత్యేక అధికారి నాయబ్ తహశీల్దార్ అనిల్, పంచాయితీ కార్యదర్శి తిరుపతి రెడ్డిలు ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు నమోదు చేసుకుని, గ్రామ సభలో పథకాల ఎంపికకు కొత్త ధరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వారు మాట్లడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేపట్టామని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ద్వారా లబ్ది చేకుర్చేందుకు కృషి చేస్తామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏదేని సమస్య ఉంటే నేరుగా సంప్రదించవచ్చునన్నారు. కాగా ఈ గ్రామ సభలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, రెవెన్యూశాఖ జూనియర్ అసిస్టెంట్ మహేష్, ఎఎన్ఎం సునీత, నాయకులు అల్గం తిరుపతి, మాదాసు పోచయ్య, మేరుగు శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, పడిదం శంకరయ్య, శేరే సత్తయ్య, మహేష్, రాజు, రామగిరి మల్లేష్, ఉప్పులేటి మారుతి, కడారి గంగాధర్, బండి తిరుపతి, పత్తిపాక చందు, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, రేషన్ డీలర్ మాదాసు తిరుపతి, చుంచు అనిల్, గ్రామ పంచాయితీ సిబ్బంది ఉరగొండ శోభన్ తదితరులు పాల్గొన్నారు.





