- సభ మధ్యలోనే వెళ్లిపోయిన అధికారులు
- అర్హుల పేర్లు లేకపోవడంతో అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం
- అధికారులను నిలదీసిన ప్రజలు
- అధికార ప్రతిపక్ష నాయకుల మాటలు యుద్ధం
- పోలీసులు రంగ ప్రవేశంతో సర్దూమనిగింపు

నేటి సాక్షి కోదాడ (అనంతగిరి) సతీష్ నాయక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు,ఆత్మీయ భరోసా,రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళను,అర్హులైన వారందరికీ అందజేయాలనే, బుధవారం 22వ తారీఖున అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ ఘర్షణకు దారితీసింది. అర్హుల పేదలకి ప్రభుత్వ ఉద్యోగులు,భూస్వాముల కుటుంబాల పేర్లు లిస్టులో రావడంతో ఒక్కసారిగా అధికారులపై గ్రామస్థులు విరుచుకుపడ్డరు.

గ్రామ ప్రజలు గ్రామసభలో గతంలో సంక్షేమ పథకాలకు అప్లై చేసుకున్న లబ్దిదారుల లిస్ట్ ను అధికారులు గ్రామస్తులకు చదివి వినిపించారు.దీంతో గ్రామస్తులు తమ పేర్లు రాలేదని అనర్హుల పేర్లు వచ్చాయని, భూస్వాములకే, ధనవంతులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి పేర్లు వస్తున్నాయని అధికారులను ప్రశ్నించడంతో గందరగోళం నెలకొన్నది.దీంతో అధికారులు అర్హులు ఎవరైనా ఉంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అయినా వినకుండా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులకు గ్రామస్తులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుష్మ, టెక్నికల్ అసిస్టెంట్ అంజిరెడ్డి, గ్రామ కార్యదర్శి నరేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.





