Friday, March 13, 2026

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు

  • జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి): పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ & గైడ్స్ తృతీయ తోఫాన్ టెస్టింగ్ క్యాంప్ లో పాల్గొని ఉత్తీర్ణులైన స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఎంపికైన 65 మంది స్కౌట్స్ & గైడ్స్ కు జిల్లా విద్యాశాఖ అధికారి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.హైదరాబాద్ లోని రాజ పురస్కార్ టెస్టింగ్ క్యాంపులో పాల్గొన్న స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ సూర్యదేవర జ్యోతి, జిల్లా స్కౌట్స్ & గైడ్స్ కమిషనర్ జె రవీందర్, ఎల్.వి.లక్ష్మి,స్కౌట్స్ & గైడ్స్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News