- శ్రీధర్ యాదవ్ సర్పంచ్ గంగయ్య యాదవ్
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : పాడి రైతుల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని.. యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ అన్నారు. బుధవారం గంగాధర్ నెల్లూరు మండలం నెల్లెపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి మురళీమోహన్ మాట్లాడుతూ పశువులకు దూడలకు మేకలకు గొర్రెలకు నట్టల నివారణ మందు, పిడుదల నివారణ మందు వేయిస్తున్నామని అలాగే దూడల ఎదుగుదల పశువుల పాల దిగుబడిపై ప్రత్యేక వైద్యం నిర్వహిస్తున్నామని తెలిపారు. గంగాధర్ నెల్లూరు మండలంలో విరక నెల్లూరు మహాదేవ మంగళం పంచాయతీల్లో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ ఉచిత పశువైద్య శిబిరాన్ని పాడు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవిందయ్య పశువైద్యాధికారి గోపాలమిత్ర తులసి పాడి రైతులు పాల్గొన్నారు.





