Friday, March 13, 2026

తూతూ మంత్రంగా జరిగిన గ్రామసభ

నేటి సాక్షి కొడిమ్యాల : కొడిమ్యాల మేజర్ గ్రామపంచాయతీ లో ఈరోజు స్థానిక ఎమ్మార్వో ఆధ్వర్యంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో అన్ని అవకతవకలే ఉన్నాయి సరైన సర్వే జరగలేదని ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఊసే లేదు అని గ్రామ ప్రజలు గ్రామసభను వ్యతిరేకిస్తూ అధికారులపై తిరగబడ్డారు. గ్రామ ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వారి ఇష్టపూర్వకంగా సర్వే రికార్డు రాశారని ఇండ్లు భూములు ఉన్నవాళ్లనె అర్హులుగా గుర్తించడం బాధాకరమని ఏమీ లేని వారిని గుర్తించడం లేదని వారికి న్యాయం జరగడం లేదని సరైన సర్వే చేసి అధికారులు నాయకులు నిరుపేదలను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ గిద్దావరి పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News