Saturday, March 14, 2026

నేటి సాక్షి దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
నేటి సాక్షి దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ – 2025 ను జిల్లా కేంద్రంలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పౌరసంబంధాల శాఖ అధికారి, కార్యాలయంలో డీపీఆర్ఓ శారద, అదే విధంగా జిల్లా కేంద్రంలోని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అంజనీపుత్ర ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి పిల్లి రవి లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ శారద మాట్లాడుతూ, పత్రికలు ప్రజల పక్షాన మాత్రమే ఉండాలని, నిస్వార్ధంగా, నిబద్దతో వార్తలు రాయాలని, నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలని సూచించారు. నేటి సాక్షి దినపత్రిక ప్రజల మన్ననలు పొందాలని, ప్రజా సమస్యలను వెలికి తీసి అధికారులకు చేరవేయడంలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది, రిపోర్టర్ ప్రభాకర్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News