- వందల సంఖ్యలో జాబ్ కార్డులు ఉన్న 9 మందే అర్హులా
- అర్హత ఉన్న మాకెందుకు రాలేదంటూ కొత్త గోల్ తండా గ్రామస్తుల నిలదీత
నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి సతీష్ నాయక్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందించాలని సదుద్దేశంతో పక్క ప్రణాళికతో ముందుకు కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో అర్హులను గుర్తించాలని వారికి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సైతం ఆదేశాలు సైతం జారీ చేసింది. కానీ అధికారులు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వివరాల్లోకెళితే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు సంబంధించి గ్రామసభలలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క పేర్లను ప్రజల ముందు చదివి వినిపిస్తుంది. లిస్టులో పేరు రాని వాళ్ళు మరలా దరఖాస్తు చేసుకోవాలని పదేపదే అధికారులు సైతం చెబుతున్నారు. కానీ సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో మాత్రం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్టులో గ్రామంలో 300 నుండి 400 వరకు జాబు కార్డులో ఉన్న అనేకమంది దరఖాస్తులు చేసుకున్న కేవలం 9 మంది పేర్లు మాత్రమే వచ్చాయని అధికారులు చెప్పడంతో ఒకసారిగా గ్రామంలో ప్రజలు విస్మయానికి గురయ్యారు. వందల సంఖ్యలో ఉపాధి హామీ పనిచేసే వారు ఉంటే కేవలం 9 మంది పేర్లు రావడమే ఏమిటా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. 9 మందిలో కూడా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబానికి సంబంధించి ఐదుగురు పేర్లు వారి బంధువుల పేర్లు నలుగురు వచ్చాయని ఇదెక్కడి చోద్యమంటూ చెవులు కోరుకుంటున్నారు. అధికారులు మాత్రం గ్రామస్తులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తప్పనిసరిగా పేర్లు వస్తాయంటూ మాట దాటవేస్తున్నారు.





