నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
మూడు మండలాల ప్రజల ప్రయోజనం కోసం మానేర్ డ్యాంపై కరీంనగర్ లోని లారెల్ స్కూల్ వెనుక నుండి మైసమ్మ గుట్ట వరకు బ్రిడ్జీ నిర్మాణం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో తీర్మానం చేసిన వినతిపత్రం కాపీని బుధవారం ఎల్ఎండి కాలనీ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి ఇవ్వడం జరిగింది. చొక్కారావు పల్లె నుండి బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఒక్క ఊరికి మాత్రమే ప్రయోజనమని అలా కాకుండా కరీంనగర్ లోని లారెల్ స్కూల్ వెనుక నుండి స్మశాన వాటికి పక్కనుండి మధ్యలో కిలోమీటర్ పావు బ్రిడ్జి మైసమ్మ గుట్ట వరకు గన్నేరువరం మండల కేంద్రం కు వెళ్లే విధంగా మార్చాలని కోరడం జరిగింది.మూడు మండలాల్లోని సుమారు 120 గ్రామాలకు ఉపయోకరంగా ఉంటుందని ఎమ్మెల్యే కు వివరించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్రిడ్జీ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్, పలు గ్రామాల మాజీ సర్పంచ్ లు పురంశెట్టి బాలయ్య ,గువ్వ వీరయ్య, చింతలపెల్లి నర్సింహారెడ్డి, జక్కనపల్లి సత్తయ్య, మల్లేశం, కుల సంఘాల నాయకులు ,జేఏసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.





