- ఈనెల 28న వెయ్యి గొంతులు లక్ష డప్పుల రంగారెడ్డి జిల్లా సన్నాహా ప్రదర్శనను విజయవంతం చేద్దాం
- మహేశ్వరం 28న మందకృష్ణ మాదిగ రాక
- పెంట నోళ్ళ నరసింహ మాదిగ
- ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
- రావుగళ్ల బాబు మాదిగ
- ఎమ్మెస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామం నుండి మాదిగ కళాబృందం రథయాత్ర ప్రారంభం మంద కృష్ణ మాదిగ ఆదేశాలన్నారు. మహేశ్వరం మండల ఇంచార్జ్ ఒక్కని రవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ కళాబృందం రథయాత్ర, ఈరోజు మహేశ్వరం మండలం లో కోళ్ల పడకల్ గ్రామం నుంచి ప్రారంభమై పోరాండ్ల, దుబ్బచర్ల, సుభాన్పూర్, మాణిక్యమ్మ గూడెం, గ్రామలా మిడిగా కళాబృందం రథయాత్ర, డప్పు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంట నోళ్ళ నరసింహ మాదిగ, ఎం ఎస్ పి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రావుగాళ్ళ బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్ట గళ్ళ ప్రశాంత్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలనే డిమాండ్ తో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాదులో వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శన జరగబోతుంది. ఈ యొక్క మహా ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా ఈనెల 28 రంగారెడ్డి జిల్లా కేంద్రంలో వెయ్యి గొంతులు లక్ష డప్పుల జిల్లా సన్నాహా మహా ప్రదర్శన జరుగుతుంది. ఈయొక్క ప్రదర్శనకు మహాజన నేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మాదిగలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు డప్పుతో కదలి రావాలని వెయ్యి గొంతులు లక్ష డప్పుల జిల్లా సన్నాహా ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమగళ్ళ చంద్రయ్య మాదిగ మాజీ ఎంపిటిసి కోళ్ల పడకల్, ఓత్తుల రఘుపతి మాదిగ వార్త విలేఖరి సీనియర్ నాయకులు ఆనందం మహేశ్వరం మాజీ సర్పంచ్, మాజీ సర్పంచ్ యాదయ్య మాదిగ కోళ్ల పడకల్, అల్వాల రవికుమార్ సిపిఎం నాయకులు, నందిగామ నరసింహ మాదిగ మాజీ సీనియర్ నాయకులు, ఎం ఎస్ పి మహేశ్వరం మండల అధ్యక్షులు ఎర్ర కృష్ణ మాదిగ, ఎంఎస్పి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కేశపగా రామచంద్ర మాదిగ, కేశాపగా స్వామి మాదిగ, బొర్ర రవి మాదిగ,తొంటా జంగయ్య మాదిగ, నడి కూడా అర్జున్ మాదిగ, సంపంగి ప్రవీణ్ మాదిగ, హనుమ గళ్ళ రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, పోరండ్ల ఉపసర్పంచ్ మల్లేష్ మాదిగ, మహేందర్ మాదిగా, సుభాన్ పూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య మాదిగ, సుభాన్పూర్ ఎంపిటిసి కుమార్ మాదిగ, మల్లేష్ మాదిగ, ఏర్పుల గణేష్ మాదిగ , ఆదిరాల స్వామి మాదిగ,మంద మహేష్ మాదిగ,మాణికమ్మ గూడెం దర్శన్ మాదిగ.





