Friday, March 13, 2026

వనపర్తి పట్టణం 14 వ వార్డులో ప్రజా పాలన సభ నిర్వహించారు

  • ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 22 : వనపర్తి పట్టణంలో 14వ వార్డు స్థానిక కౌన్సిలర్ బ్రహ్మం చారి అధ్యక్షతన ప్రజా పాలన సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ పాల్గొన్నారు.వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ 14 అవార్డులో నిర్వహించిన ప్రజా పాలన సభ కార్యక్రమానికి వచ్చిన వార్డు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చమన్నారు. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 కు గ్యాస్ సిలిండర్ రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం జరిగిందన్నారు.ఈనెల 26వ తారీకు రోజు కొత్తగా నాలుగు పథకాలు అమలు చేయడం జరుగుతుంధన్నారు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎలక్షన్ల ముందర ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలనే కొన్ని గ్యారంటీలు అమలు చేయడం జరిగింది.మిగిలిన గ్యారెంటీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.అందరికీ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.చెప్పుడు మాటలు నమ్మొద్దు అర్హులైన అందరికీ పథకాలు అందుతాయి అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య,మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్రారెడ్డి, మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ విభూతి నారాయణ,వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, వార్డు ప్రజలు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News