Friday, March 13, 2026

సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు

  • వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి గ్రామ సభలు
  • రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నాము
  • తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్ ,అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సదుద్దేశం తో గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకం కావడానికి ,క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకో వడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి గ్రామ సభలు నిర్వహిస్తుంటారు అని అన్నారు.అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు అని అన్నారు.ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న జాబితా లో పేరులేని వారు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియన్నారు.రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు.మన ప్రజా ప్రభుత్వంలో టిఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులు,అప్పులను సరిజేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామ న్నారు.కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామన్నారు. పథకాలకు లబ్ధిదారుల ఎంపికలు రాజకీయాలకు తావు లేదు పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించా లన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గతంలో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు.అదేవిధంగా గత సంవత్సర కాలంలో 20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమిలేని నిరుపేదలు అందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు.మొదటి దశలో సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలతో కట్టిస్తామన్నారు.ఈ నాలుగు రోజులపాటు జరిగే ప్రజా పాలన గ్రామసభలలో ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి,ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తు పెట్టుకుంటే వాటిని కూడా పరిశీలించి గుర్తిస్తామన్నారు. ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరుగుతాయి,ఈ జనవరి 26 కు కొంత మందికి మిగతా వారికి దశలవారీగా ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయబోతున్నాం అని అన్నారు.ఎలక్షన్లో మాట ఇచ్చినట్టు 2 లక్షల వరకు రుణమాఫీని 22,000 కోట్లతో చేశామన్నారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అర్హులందరికీ అందిస్తున్నామని, మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి ప్రతినెల 300 కోట్లు కడుతున్నాం.గ్యాస్ సిలిండర్లు 500లకే ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ ఎమ్మార్వో తిలక్ , మండల్ స్పెషల్ ఆఫీసర్ గోవింద నాయక్ ,ఆర్ఐ ప్రసన్న , విలేజ్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్, ఏఈ. శిరీష, ప్రభుత్వ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లెల ప్రవీణ్ కుమార్ రెడ్డి, పర్వతాలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News