నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్: క్యాట్ ఒలంపియాడ్ లో సత్తా చాటిన శ్రీ చైతన్య తుక్కుగూడ విద్యాసంస్థ.దేశవ్యాప్తంగా నిర్వహించే క్యాట్ ఒలంపియాడ్ పరీక్షలో తుక్కుగూడ శ్రీ చైతన్య విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.ఎం సాన్వి శ్రీ,ఎస్ సాన్విక, పి. వివేక్, గుడ్డు కుమారులు క్యాష్ అవార్డుతో పాటు,మరియు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. కే. భువన శ్రీ, జి. హరిప్రియ, జి. వెంకట సత్య శ్రీ,శ్రీ వాస్తవ యువిక, ఏ. శ్రీ సాయి తేజ, ఆన్య గుప్త, ఎం. ప్రవల్లిక, ఎం. గణేష్ గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్స్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రకాష్ నాథ్ విద్యార్థులను అభినందించారు. ఏజీఎం ఖాసిం అలీ విద్యార్థులను ప్రోత్సహించినందుకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. తుక్కుగూడ శ్రీ చైతన్య బ్రాంచ్ ను అన్ని రంగాలలో పురోగతి సాధించేలా కృషిచేసినరని పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య ఉపాధ్యాయులను ప్రశంసించారు. అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్ తన చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందించారు.ఈ కార్యక్రమంలో డీన్ వెంకటయ్య, ఉపాధ్యాయులు కుమార్, రత్నమంజూష, శివ, సౌజన్య, మల్లేశం మరియు ఏవో నరసింహ తదితరులు పాల్గొన్నారు.





