- కాంగ్రెస్ యూత్ నాయకుల ఆగ్రహం
- బెజ్జంకి ఎస్ఐ కి ఫిర్యాదు
నేటి సాక్షి, బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామ సభలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ న్యూస్ ఛానల్ ఆయనపై అవాస్తవ సమాచారాన్ని ప్రసారం చేస్తూ, బురద జల్లే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కర్రావుల సందీప్ బెజ్జంకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు టీ న్యూస్ ప్రతినిధి ఎవరూ హాజరుకాలేదు. నిజాన్ని ప్రత్యక్షంగా చూడకుండా, నిరాధార ప్రసారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పత్రికా నిబంధనలను ఉల్లంఘించి, గౌరవ ఎమ్మెల్యే పై అవాస్తవ సమాచారాన్ని ప్రసారం చేయడం సరికాదని యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ మచ్చ కుమార్, మానకొండూర్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శానకొండ శరత్,నాయకులు రాజు రెడ్డి, జేరిపోతుల మధు, నవీన్, ప్రశాంత్, శ్రీకాంత్, శ్రీహరి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.





