- సంక్షేమం నిరంతర ప్రక్రియ డిప్యూటీ తాసిల్దార్ వి. నవతా
- అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో భాగంగా డిప్యూటీ తాసిల్దార్ వి. నవతా తో పాటు ఏఈఓ నాగారం కస్టర్ ఇంచార్జ్ శ్రీవిద్య, ఆర్ఐ పావని ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. డిప్యూటీ తాసిల్దార్ వి నవతా మాట్లాడుతూ… నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం అందించి అర్హులను గుర్తించేందుకు వార్ సభలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని సంక్షేమ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ వారు సభను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, కావలి దశరథ, బండారి లింగం ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ కుండే.నరసింహ, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ లతీఫ్ ఖాన్, మాజీ ఉపసర్పంచ్ పల్నాటి యాదయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్నాటి నరేష్, మాజీ వార్డు సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ మాట్లాడుతూ…. ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి ఇప్పుడు సాంక్షన్ అయి ఉన్నాయో అందరికీ వచ్చే విధంగా ఉండాలని అదేవిధంగా అర్హులను గుర్తించి నిరుపేదలకు లబ్ధి చేరేవిధంగా ఉండాలని తెలియజేశారు. మహేశ్వరం మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి దశరథ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ల పేర్లు లిస్ట్ లలో రాకపోతే మాత్రం మీరు ఇప్పుడు అప్లై చేయండి తప్పకుండా అందరికీ వచ్చే విధంగా చేస్తాను అప్లై చేసిన వెంటనే పంచాయతీ కార్యదర్శి ఎస్ జానయ్య కి ఇచ్చినట్లయితే అవన్నీ కూడా పరిచయంలో తీసుకొని ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, వీటికి అప్లై చేసుకున్నట్లయితే అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తానని మాజీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కావాలి దశరథ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్ జానయ్య, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.





