Saturday, March 14, 2026

ఇల్లందకుంట గ్రామసభ … ఆపై రసాబస

నేటిసాక్షి, ఇల్లందకుంట:
ఇల్లందకుంట మండల్ సిరిసేడ్ గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సభను గ్రామ ప్రజలు మహిళలు యువకులు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. తమ పేర్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మరియు కొత్త రేషన్ కార్డులో పేర్లు రైతు భరోసా లో పేర్లు వచ్చిన ఆనందంతో ఉన్నారు. ఈ సభను కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల మైనారిటీసెల్ అధ్యక్షుడు మహమ్మద్ అజ్గర్ పాషా మరియు బుర్ర రమేష్, కురిమిండ్ల చిరంజీవి, నేరేళ్ళ కుమారస్వామి, బోగం సాయిరామ్, బోగం చిరంజీవి, మురహరి రాజు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈసభలో పాల్గొనడం జరిగింది. గ్రామ సభకు వచ్చిన అధికారికి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం చివర్లో ప్రతిపక్ష పార్టీల యువకులు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారెంటీలు, ఇచ్చిన హామీలపై మాట్లాడారు. దీంతో ఆగ్రహానికి గురైన అధికార పార్టీ మద్దతుదారులు గత భారాస తొమ్మిదేండ్ల హయాంలో చేసిందేమిలేదని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News