ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో భాగంగా మన ఇంటి మందం మన పంట
నేటిసాక్షి, జమ్మికుంట :
(ప్రకృతి వ్యవసాయం) అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి లో లభించే సహజ వనరులతో వ్యవసాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలని మన ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని దీని ముఖ్య ఉద్దేశం.ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ప్రకృతి లో కాలుష్యం నివారించవచ్చు ఇందులో భాగంగా మంగళవారం జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రామడుగు లక్ష్మి సంపత్ రావు గార్ల,ఇంటి వద్దా వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రామడుగు లక్ష్మి సంపత్ రావు అనే రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనారు దీనిలో భాగంగా 1 ఎకరం వ్యవసాయ భూమిలో జీవామృతం (ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి ,రసాయనాలు కల పని మట్టి లేదా పుట్ట మట్టి ) తయారు చేసి వాళ్ళ 1 ఎకరం భూమికి పారించడం జరిగింది. దీనివల్ల భూమిలో ఉన్న మేలుచేసే సూక్మజీవుల సంఖ్య పెరిగి భూసారం పెరుగుతుంది.తద్వారా ఆరోగ్య కరమైన మరియు నాణ్యమైన పంట వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జమ్మికుంట క్లస్టర్ కో ఆర్డినేటర్ దేవునూరి రవీందర్ ,ఫీల్డ్ ఫెసిలెటర్ గిరవేన అభిషేక్ యాదవ్ మరియు తదితర రైతులు పాల్గొన్నారు





