Saturday, March 14, 2026

జమ్మికుంట 19వ వార్డులో వార్డు సభ

నేటిసాక్షి, జమ్మికుంట:
చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డు గత ప్రభుత్వ హయాంలో ఇవ్వనటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు మరియు గత ప్రభుత్వ హయాంలో మీ సేవ కేంద్రాలలో పెట్టుకున్నటువంటి రేషన్ కార్డులో పేర్ల తొలగింపు మరియు పేర్ల జమచేయుట వంటి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ కోటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు, పేర్ల మార్పు చేర్పుల ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద బురదజల్లే విధంగా వస్తున్నటువంటి వార్తలు ఎవరు పట్టించుకోవద్దు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులు తప్పకుండా ఈ ప్రభుత్వం అందిస్తుంది. అర్హులందరికీ అన్ని పథకాలు అందేలా చూస్తామని దేషిని స్వప్న కొటి తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ శేఖర్, శ్రీకాంత్, ఆర్పీ జేరిపోతుల సృజన, సిబ్బంది, ఉద్యోగులు కోడెం రాజు, దూడపాక స్వామి, అంగన్వాడి టీచర్ స్వప్న, కాంగ్రెస్ నాయకులు దేశిని శ్రీనివాస్, ఎండి సజ్జు, ఉడత వెంకటేష్, ఆడెపు దేవరాజ్, ఎండి ఖలీల్, మంద సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News