- హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని రంగాపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో ప్రజా పాలన లో రసభ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తీ అయిన ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిరుపేద కుటుంబాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజా పాలనకు వచ్చిన అధికారులపై తమ నిరసన వ్యక్తం చేసి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.





