నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో గురువారం పశువైద్య, పశుసంవర్థక శాఖ మరియు పశువైద్య కళాశాల కోరుట్ల అధ్వర్యంలో ఉచితంగా పశువైద్య శిబిరాన్ని మెట్టుపల్లి మండల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.బక్కయ్య మరియు కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం. శ్రీనివాసులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 9 ఆవులు, 60 గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు మరియు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్యంపేట పశువైద్యాధికారి డాక్టర్ జి.అశోక్, ఇతర మండలపశువైద్యాధికారులు డాక్టర్ గంగప్రసాద్, డాక్టర్ అచ్చె శ్రీనివాస్, డాక్టర్ మనీషా పటేల్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రియాంక మరియు కళాశాల విద్యార్థులు పశువైద్య సిబ్బంది ఇక్బల్, రవీందర్ గ్రామస్తులు అశోక్, వినోద్, శంకర్, శ్రీనివాస్ రెడ్డి మరియు పాడిరైతులు పాల్గొన్నారు.





