
నేటి సాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపురం గ్రామంలో గురువారం గుండు బాబు, తండ్రి: రాజయ్య అనే రైతు తన వ్యవసాయ పొలంలో రోజు లాగానే నిన్న రాత్రి పశువులను కట్టేశాడు ఈరోజు బాబు ఉదయం పశువుల పాకలోకి వెళ్లి చూడగా ఆవు కనిపించకపోవడంతో పొలం చుట్టూ తిరిగి చూడగా చెట్ల పొదల్లో పెద్ద పెద్ద గోర్ల ఘాట్లతో పెద్ద దంతాల గాయాలతో చనిపోయి ఉన్న ఆవును చూసి ఒక్కసారిగా చెల్లించిపోయి ఇది పెద్దపులి గాయాలని అనుమాన పడుతూ యజమాని బాబు తన 40 వేల విలువ గల ఆవు దూడ అలా చనిపోయి కనిపించగా తీవ్రమైన బాధతో కూమిలిపోతున్నాడు. బీద పరిస్థితిలో నేను నలుగురు ఆడపిల్లలను వీటి ఆధారంగా పోషించుకుంటూ జీవనోపాధి గడుపుతున్నాను. సంబంధిత ప్రభుత్వ అధికారులు పరిశీలించి నాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాడు.





