Saturday, March 14, 2026

ఈనెల 28న వెయ్యి గొంతులు లక్ష డప్పుల రంగారెడ్డి జిల్లా సన్నాహా ప్రదర్శనను విజయవంతం చేద్దాం

  • మహేశ్వరం 28 న మందకృష్ణ మాదిగ రాక

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రావుగళ్ల బాబు మాదిగ, ఎమ్మెస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, దేశాపగా రాంచందర్ మాదిగ, ఎంఎస్పి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు
మంద కృష్ణ మాదిగ ఆదేశాలన్నారు మహేశ్వరం మండల ఇంచార్జ్ ఒక్కని రవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ కళాబృందం రథయాత్ర, ఈరోజు మహేశ్వరం మండలం లో అమ్మిర్పేట్, గోల్లూరు, నాగిరెడ్డిపల్లి, నాగారం, నందిపల్లి గ్రామలా మిడిగా కళాబృందం రథయాత్ర, డప్పు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తదనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రావుగాళ్ళ బాబు ఎంఎస్పి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాంచందర్ మాదిగ, మాదిగ ప్రజాప్రతినిధులు మాజీ జడ్పీటీసీ యాచారం జంగయ్య మాదిగ, హన్మగాళ్ల చంద్రయ్య మాదిగ మాజీ ఎంపిటిసి,మాజీ సర్పంచ్ మహేశ్వరం సన్నగంటి ఆనంద్,పొత్తుల రఘుపతి మాదిగ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలనే డిమాండ్ తో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాదులో వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శన జరగబోతుంది. ఈ యొక్క మహా ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా ఈనెల 28 రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహేశ్వరం మండల్ కేంద్రంలో వెయ్యి గొంతులు లక్ష డప్పుల జిల్లా సన్నాహా మహా ప్రదర్శన జరుగుతుంది. ఈయొక్క ప్రదర్శనకు మహాజన నేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మాదిగలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు డప్పుతో కదలి రావాలని వెయ్యి గొంతులు లక్ష డప్పుల జిల్లా సన్నాహా ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ, బాచిలకూర స్వామి, రాంచందర్, కొత్తగూడెం జగన్ ఎంఇఎఫ్ మండల్ అధ్యక్షులు, తొంట నర్సింహా, నర్కుడ అర్జున్ మాదిగ, గుండెపు రాములు మాదిగ,అశపల్లి శంకరయ్య, ఆగమయ్య, ఏడుపుల గణేష్, కొందోని మహేందర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News