Saturday, March 14, 2026

ప్రజలను పట్టించుకోని గత బిఆర్ఎస్ పాలన

  • ఓదెల మండలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్త
  • కొలనూరులో సింగిల్ విండో సొసైటీ ఏర్పాటు
  • ఎమ్మెల్యే విజయరమణా రావు

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి తిరుపతి) : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గురువారం రోజున శానగొండ, ఓదెల, కనగర్తి,పోత్కపల్లి కొలనూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అమలు కార్యక్రమంలో గ్రామ సభలకు ముఖ్యఅతిధిగా హాజరైనా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రభుత్వం తలపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలు అమలులో అర్హులైన ప్రజలందరికీ న్యాయం జరుగుతున్నాయని ఎవరి వద్దకు పైరవీలకు వెళ్లవద్దని సంక్షేమ పథకాలు ఎవరికి డబ్బులు ఇచ్చినా తీసుకున్న తాను కచ్చితంగా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుందని రేషన్ కార్డులు కచ్చితంగా వస్తాయని,ఆయన వినిపించారు. పోత్కపల్లిలో త్రాగినీటి సమస్యను తొందర్లోనే తీరుస్తానని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని సందర్భంగా పేర్కొన్నారు. మండలంలోని అతి ముఖ్య గ్రామమైన కొలనూరుకు తొందర్లోనే సింగిల్ విండో సొసైటీని ఏర్పాటు చేస్తానని మండలాల ఏర్పాటులో భాగంగా సమయం వచ్చినప్పుడు మండలం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా కొలనూరు గ్రామస్తులకు వివరించారు. మండల కేంద్రం ఓదెలలో ప్రభుత్వ ఆసుపత్రిని 24 గంటల వైద్య సదుపాయం కోసం చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్యాలను ప్రజలు ఖండించాలని సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కణార్తి గ్రామ సభకు మండల ప్రత్యేక అధికారి జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్,పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల సరూప, స్థానిక సింగల్ విండో చైర్మన్ ఆల సుమన్ రెడ్డి, తాసిల్దారు యాకన్న, ఎంపీడీవో తిరుపతి, ఎంపీఓ షబ్బీర్, భాష భాస్కర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి,సింగిల్ మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి,బైరి రవి, చీకట్ల మొండయ్య,ఆకుల మహేందర్, రెడ్డి రజినీకాంత్, రాహుల్,ఢిల్లీ శంకర్, గోపతి సది,బోడగుంట శంకర్,అంబాల కొమురయ్య, వంగ శ్రీనివాస్,భాస్కర్ రెడ్డి లతోపాటు మండల ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News