Saturday, March 14, 2026

విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు

  • జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన తరగతుల పోస్ట్మెట్రిక్ బాలికల వసతి గృహాలలో జిల్లా రవాణాశాఖ అధికారి సంతోష్ కుమార్ తో కలిసి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, డైట్ చార్జీలు పెంచి నూతన మెను అమలు చేస్తూ పోషక విలువలు గల ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి విద్యార్థులకు వేడినీటి కొరకు 2 గీజర్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి, ఎబిసి డబ్ల్యు. ఓ, విద్యార్థినులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News