యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణ రెడ్డి
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో గురువారం రసభసగా గ్రామసభ జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వాదం జరిగింది. మానకొండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణ రెడ్డి మాట్లాడుతూ అధికారం కోల్పోయి మతిస్థిమితం కోల్పోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆనందం పొందుతూ ప్రజలకు పథకాలు దూరం చేస్తున్నారని అన్నారు. ప్రజలు గమనించలేక వారి మాయమాటలకు నమ్మి కొందరు అమాయక ప్రజలు మోసపోతున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. గ్రామసభలలో కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి దరఖాస్తులను స్వీకరించే దిశగా సాగుతుంటే కొందరు స్వార్ధ రాజకీయాల ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.





