Saturday, March 14, 2026

సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ సొసైటీ జిల్లా మీడియా కన్వీనర్ గా గరిడేపల్లి మురళి

నేటి సాక్షి, అనంతగిరి: హక్కులను ఉపయోగించుకోవడం ప్రతి పౌరుడు బాధ్యత అని సమాచార హక్కు చట్టం యాక్టివిటీ సొసైటీ జిల్లా మీడియా కన్వీనర్ గరిడేపల్లి మురళి అన్నారు.గురువారం తనను జిల్లా మీడియా కన్వీనర్ గా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు గుగులోతు నరేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు ఇచ్చిన అవకాశాన్ని జిల్లా పౌరులకు పూర్తిస్థాయిలో సమాచార హక్కుల పై అవగాహన వచ్చేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.సమాచార హక్కు చట్టం ద్వారాపూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ప్రతి పౌరుడు భాద్యతా అని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యాలయాలు,సంస్థల నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకోవడమే సమాచారం హక్కు అని ఆయన తెలిపారు. 2005 వ సంవత్సరం సమాచార చట్ట హక్కు అమలులోకి వచ్చిందని ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు ఉద్యోగుల బాధ్యతలు మొదలగు 17 అంశాలుగురించి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News