Saturday, March 14, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

  • మాజీ సర్పంచ్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు

నేటిసాక్షి, మంగపేట : మండలంలో బుచ్చంపేట గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభ మండల ఏం పి డి ఒ బద్రు నాయక్ అధ్యక్షతన ప్రశాంతంగా జరిగింది ప్రజా పాలన గ్రామ సభలో గ్రామ మాజీ సర్పంచ్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేషన్ కార్డుల విషయం లో ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు అర్హులైన వారి రేషన్ కార్డు తొలగించే ప్రసక్తే లేదు రేషన్ కార్డుల ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ మహిళా భరోసా రైతు భరోసా దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని అమలు పరచలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందించారని బి.ఆర్.ఎస్ పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కొత్త కార్డులు అర్హులైన వారందరికీ అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుందని తమ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి కార్డు అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ సుదర్శన్ చిట్టీమల్ల సమ్మయ్య పల్లె శోభన్ బాబు జంగం బానుచందర్ కాటూరి నాగయ్య రాసకొండ సోమయ్య ఎడ్ల నరేష్ బూర్గుల వెంకటమల్లు గడ్డం శ్రీహరి ఎంపెల్లి సమ్మయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది అంగనివాడి టీచర్స్ ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News