- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో అధికారులను నిలదీసిన గ్రామస్తులు
- గ్రామ సభ నిర్వహణలో బయటపడిన వైఫల్యం
- ప్రోటోకాల్ పాటించని అధికారులు

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి :
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో గురువారం జరిగిన గ్రామ సభ రసాభాసగా సాగింది. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జాబితాలు తప్పుల తడకగా ఉండడంతో నిరసనలు, నిలదీతలతో గ్రామ సభ రణరంగంగా మారింది. లబ్ధిదారుల జాబితాలను అధికారులు చదివి వినిపిస్తుండగా అధిక శాతం మంది పేర్లు లేకపోవడంతో సభల్లో గందరగోళం నెలకొన్నది. ఆగ్రహిస్తున్నవారిని బుజ్జగించేందుకు మరోమారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు, కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే, ప్రజాపాలన, మీ సేవల్లో దరఖాస్తులు చేసుకున్నామని, మళ్లీ దరఖాస్తులు ఏమిటని నిలదీశారు. ఆయా గ్రామాల్లలో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనగా, అర్హులమై ఉండి కూడా లబ్ధిదారుల జాబితాలో పేర్లు రాలేదని తీవ్రస్థాయిలో జనం తిరుగబడ్డారు. ఈ క్రమంలో మళ్లీ దరఖాస్తులు చేసుకుంటే పరిశీలిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సర్దిచెప్పడం కనిపించింది.
ప్రోటోకాల్ వివాదం: రామారావుపల్లి గ్రామంలో గురువారం ప్రజపాలన గ్రామ సభను అధికారులు ఏర్పాటు చేసిన కార్య్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫోటో ఫ్లెక్సీలో లేకవడంతో ప్రోటోకాల్ పాటించలేదని వివాదం నెలకొంది. ప్రజా పాలన గ్రామ సభ అధికారుల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిజెపి నాయకులు మండిపడ్డారు.





