- రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : అభివృద్ధి సంక్షేమానికి ప్రజా ప్రభుత్వంలో సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రుద్రంగి మండలం మానాల బడి తండా గ్రామంలో డిప్యూటీ ఎమ్మార్వో యాదగిరి, ఆర్ ఐ మధు ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 14 మంది లబ్ధిదారులకు 14 లక్షల విలువగల కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… గత రెండేళ్ల క్రితం వివాహాలు జరగగా, గత బిఆర్ ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడంలో నిర్లక్ష్యం చేశారని, టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని తెలిపారు. మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ చెక్కులను అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నామన్నారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి రెండు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, మళ్లీ పది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళా తల్లులకు ఉచితా బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతీ పెద వారికి మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనీ తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో కొట్లాడిన వాటిపై నేడు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నామని అన్నారు. రాజకీయాలకతీతంగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొమ్ముల రవీందర్ రెడ్డి, గజన్ లాల్, మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, మాజీ సర్పంచ్ బుర్ర నారాయణ, జక్కు మోహన్, జక్కు లింగారెడ్డి, భూక్యా అంబర్ సింగ్, జక్కుల లక్ష్మి నర్సయ్య, జక్కు వంశీ, తునికీ నర్సయ్య, లాకవత్ బాలు, రాందాస్, లోక్యా నాయక్, రమణయ్య, తిరుపతి, మధన్, దూప నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





