Saturday, March 14, 2026

భాదిత కుటుంబాలకు కొప్పుల పరామర్శ

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు భాదిత కుటుంబాలను గురువారం పరామర్శించారు. మండలంలోని చర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు రామస్వామి తండ్రి మల్లయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది రాగా వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన మరో బీఆర్ఎస్ కార్యకర్త పడిదం సత్తయ్య సతీమణి రాజేశ్వరి అనారోగ్యంతో చికిత్స పొంది మంగళవారం మరణించగా వారి చిత్రపటానికి పూలమాలతో నివాళిలర్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ఓదార్పు అందించారు. కార్యకర్తలు భాదలో తోడుంటానని కొప్పుల ఈ సందర్బంగా భరోసానిచ్చారు. వీరివెంట బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్, నాయకులు ఏలేటి కృష్ణా రెడ్డి, గాజుల మల్లేశం, పడిదం నారాయణ, వెంకటేష్, మొగిలి, శేరే శ్రావణ్, సత్తయ్య, మహేష్, సోల్లు రాజేష్, గాదం బాస్కర్, దుర్గం కృష్ణ, చింతల తిరుపతి, దేవి నరేష్ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News