Saturday, March 14, 2026

గ్రామసభలో నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక

నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం రామకృష్ట పురం గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం ప్రజా పాలన గ్రామ సభ కార్యక్రమం ఎంపీడీవో స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డులు మంజూరు లాంటి నాలుగు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయం సేకరించడానికి మరియు ఈ నాలుగు పథకాలకి అర్హులైన లబ్ధిదారులకి అన్ని పథకాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హులు జాబితా, రేషన్ కార్డు అర్హుల జాబితా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల జాబితా, రైతు భరోసా అర్హుల జాబితా చదివి వినిపించడం జరిగింది. నేడు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలు రైతు భరోసా పథకం కొరకు 14.దరఖాస్తులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు 17 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం 14.దరఖాస్తులు.కొత్త రేషన్ కార్డులు 14 దరఖాస్తులు వచ్చాయి వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అర్హులని గుర్తిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో. స్వరుప, సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ రాజేశ్వర్, ఏ ఈ ఓ.ప్రశాంత్, ఏ పి ఓ. సతీష్ సెక్రటరీ మహేష్, గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News