- బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్
- దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్
నేటి సాక్షి-కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన మహోన్నత స్వాతంత్ర సమరసేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. వారు దేశానికి కోసం ఎంతో గాను పోరాడారని గుర్తు చేశారు. నాకు రక్తాన్ని ఇవ్వండి నేను దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పిన మహోన్నత గొప్ప పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. జయంతి ఉండి వర్ధంతి లేని దేశంలో ఒకే ఒక్క నాయకుడు మహోన్నతుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. వారి జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాలను కోరారు. నేతాజీ వారసత్వ పోరాటాన్ని భవిష్యత్తులో పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల, యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్,జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, శంకర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు , ప్రశాంత్, బద్రి నేత, ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్ , జిల్లా ఏఐఎస్బి నేతలు రాకేష్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.





