నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలు లో గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2025 పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిసిపి రవీందర్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి ,డిసి ఎస్ ఓ కిష్టయ్య తో పాటు పెట్రోల్ బంక్ యజమానుల తో సమీక్ష నిర్వహించడమైనది. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నో హెల్మెట్ – నో పెట్రోల్ అనే నిబంధనలు పెట్రోల్ బంక్ యజమానులు పాటించాలని అన్నారు. పెట్రోల్ బంక్ యజమానులు ట్రాఫిక్ నిబంధనల బోర్డులను ప్రదర్శించి వాహన దారులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఆర్టిఏ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించి ప్రమాదాలను అరికట్టాల్సిందిగా ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని ఆర్టిఏ అధికారులను ఆదేశించడమైనది. రోడ్డు రవాణా సంస్థ వారు ప్రజల అవేర్నెస్ కల్పించాలని వారు ప్రతి వాహన శోధకులకు హెల్మెట్ తప్పనిసరి సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని రోడ్డు దాటడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడప కూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడ పరాదు, అతివేగం ప్రమాదకరం నిర్లక్ష్యం ఓవర్టేక్ చేయరాదు అనే స్లొగన్స్ ను అడుగడుగునా ఏర్పాటు చేసేలా రోడ్డు మూల మలుపులకు జాగ్రత్తగా వెళ్లవలసిందిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్టీఏ అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రైవింగ్ పైన అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఆర్టీఏ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు పెట్రోల్ బంక్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ పెట్రోల్ బంక్ డీలర్లు, పౌర సరఫరా అధికారి కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





