నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ: భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘన నివాళులు అర్పించారు. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి, బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, ఇప్పపుల అజయ్, వంగళ శ్రీనివాస్, సాగరం వెంకట స్వామి, గూడూరి మధు, కూరగాయల కొమురయ్య, కొక్కుల బాలకృష్ణ, తోట రాజు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.





