- బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి నాయక్
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి నాయక్ అన్నారు. గురువారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేగవత్ తిరుపతి నాయక్ మాట్లాడుతూ… బుధవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడిన రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వాక్యాలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మానాల గ్రామానికి 14 మంది లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి చెక్కులు వచ్చి నెలలు గడుస్తున్నా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది గడించిన చెక్కులను పంపిణీ చెయ్యలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని గుర్తు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి తులం బంగారం మాట ఇచ్చి మాట తప్పారని, మా మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిరసనగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు తెలిపారని తెలియజేశారు.
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులతో చెక్కులు పంపిణీ చేయాలని సూచించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగలేదని అన్నారు.
మీ కాంగ్రెస్ నాయకులు చెక్కులు వచ్చిన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పైరవీలు చేస్తున్నారని మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మా ప్రభుత్వంలో పైరవీలు జరిగినట్టు మాట్లాడిన మాటలు అవాస్తవం కొట్టి పారేశారు.
డిగ్రీ చదివే ఆడపిల్లలకు స్కూటీలు, అత్తకు 4000, కొదలుకు నెలకు రూ.2,500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రైతు భరోసా, ఉచిత గ్యాస్ వంటి ఇస్తామని ఏ ఒక్క హామీ అమలు చేయలేరని తెలిపారు.
వెంటనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని,అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ను విమర్శించడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని రాజేశం, ఉప అధ్యక్షులు గంగా నర్సయ్య, గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు పీసరి రవీందర్, ఉమ్మడి మానాల బిఆర్ యస్ పార్టీ నాయకులు బడి తండా గజన్, విరుని తండా మోహన్, తార్య రవి, బొల్లోజీ రవి, మహమ్మద్ రహీమ్,మురళీ, రఘు, రవి తదితరులు వున్నారు.
- ఉదయం ప్రెస్ మిట్.. సాయంత్రం చెక్కుల పంపిణీ :
ఇది ఇలా వుండగా బిఆర్ యస్ పార్టీ నాయకులు ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించడంతో విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు గురువారం సాయంత్రం లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.





