Saturday, March 14, 2026

ఉద్రిక్తంగా మారిన గ్రామసభ

  • నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి
  • దూష పదజాలంతో కాంగ్రెస్ నాయకులను నిలదీసిన పాడి
  • కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు
  • కాంగ్రెస్,బిఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల);
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రంలోని ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల కేంద్రంలోని శుక్రవారం రోజున గ్రామసభ నిర్వహణ చేపట్టిన కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై కాంగ్రెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ కాంగ్రెస్ పార్టీ గ్రామసభ సందర్భంగా ఇచ్చే సంక్షేమ పథకాల గురించి వివరణ ఇస్తుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6గ్యారంటీల విషయంలో మాట తప్పుతుందని ప్రజల పక్షాన మాట్లాడుతున్నానని కాంగ్రెస్ శ్రేణుల నాయకుల పై దూష పదజాలంతో మండిపడ్డారు.అదేవిధంగా 6 గ్యారంటీలు మరియు గ్రామసభల నిర్వహణ కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలు నెరవేర్చే ఉద్దేశం లేదని,ప్రజలకు న్యాయం చేసే నడవడిక కాంగ్రెస్ పార్టీకి లేదని పలు వ్యాఖ్యలు చేశారు.ఆ తదనంతరం కాంగ్రెస్ నాయకులు మరియు బిఆర్ఎస్ నాయకుల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది.అదే సమయంలో కొందరు నాయకులు మరియు ప్రజలు పాడి కౌశిక్ రెడ్డి పై టమాటాలు,కోడిగుడ్లు విసరడంతో ఎమ్మెల్యే తో పాటుగా ఇతర అధికారుల పై కూడా పడడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News