
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ మండలం జాన్ పాక లో రూట్ వాచ్ నిర్వహిస్తుండగా గుడుంబా రవాణా చేస్తున్న పైడిపల్లి కి చెందిన సింగారం జనార్దన్ ను అరెస్ట్ చేసి అతని వద్దనుండి 10 లీటర్ల గుడుంబా, ఒక బైక్ ను స్వాధీనం చేసుకొని, జాన్ పాక లో నిర్వహించిన దాడి లో బానోత్ స్వప్న ను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 10 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకొని, గుడుంబా తయారీ కై నిల్వ ఉంచిన 200 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ తాతాజీ తెలిపారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు జ్యోతి, పద్మ, సిబ్బంది లక్ష్మణ చారి, శ్రీనివాస్, సమ్మయ్య, విజయ్ కుమార్, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





