- బిఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ
నేటిసాక్షి/మంగపేట : మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ పదేండ్లలో బిఅర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులో ఇయ్యలేదని చెప్పుతున్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నాలుగు లక్షల పదివేల రేషన్ కార్డులను ఇచ్చిన విషయాన్ని వారు తెలుసుకొవాలి. గ్రామసభలో పెట్టి అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇస్తామని చెప్పుకునే మీరు రాష్ట్రంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా వేదికల మీద మా పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటామని చెప్పుతున్నారు, మీరు రాష్ట్రలో జరుగుతున్న గ్రామసభల వ్యవహారాన్ని చూస్తలేరా ఇది మీ కండ్లకు కనపడటం లేదా ప్రజలంతా కూడా గ్రామసభలలో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం నిజం కాదా మాయాబజార్ సినిమా ల తలపిస్తోంది. గ్రామ సభలలో అధికారులు ఒక్కొక్క గ్రామానికి 600 నుడి 900 ఇల్లు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి అర్హులను బట్టి పేర్లను చదువుతున్నారు. కానీ మీ ప్రభుత్వం, మంత్రులు బహిరంగ వేదికల మీద నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పుతున్నారు. ఆ విధంగా లెక్కిస్తే మన ములుగు నియోజకవర్గంలో పది మండలాలు ఉన్నాయి కొత్తగా ఏర్పడిన మల్లంపల్లితో కలిపి పది మండలాలకు 3500 ఇళ్లలో మండలానికి వచ్చే ఇల్లు ఎన్ని గ్రామానికి వచ్చే ఇండ్లు ఎన్ని మీరు ఇచ్చేటి ఎన్ని గ్రామంలో అర్హుల పేరు చదువుతున్నారు కానీ మీరు ఇచ్చే 3500 ఇల్లు నియోజకవర్గంలో ఏ మూలకు కూడా సరిపోతాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా కన్నాయిగూడెం లో గ్రామ సభలో ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మా జిల్లా పార్టీ అధ్యక్షులు
రెచ్చగొడితే ఆత్మహత్యకు పునుకున్నాడు అని కాంగ్రెస్ నాయకులు ఆపనిందలు వేస్తున్నారు రెచ్చిపోవడానికి కుమ్మరి నాగేశ్వరరావు అనే వ్యక్తి చిన్నపిల్లవాడు కాదు. వారికి అవగాహన ఉన్న వ్యక్తి వారికీ అర్హుల లిస్టులో వారి పేరు లేనందున వారు ఆ విధంగా చేశారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టే రెచ్చిపోయి జరిగిన సంఘటన కాదు అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించాలి. ఈ విషయాలన్నీ తెలియకుండా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మీద నోటికొచ్చినట్టు విమర్శలు చేయడం సరైన చర్య కాదని తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మండల పాక్స్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ , జిల్లా నాయకులు తాటి కృష్ణ,బిఅర్టియు ములుగు జిల్లా అధ్యక్షులు ఎస్ కే కూర్బన్ ఆలీ,సీనియర్ నాయకులు చిలకమర్రి రాజేందర్, చిట్టీమల్ల సమ్మయ్య గాదె శ్రీనివాస చారి తుక్కని శ్రీనివాస్ చల్లగురుగుల తిరుపతి,మండల మహిళా అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి పంజాల సత్యనారాయణ,ఎలవర్తి శ్రీనివాస్,గుడిసేవ నాగేశ్వరావు, రాతన్ సింగ్ , గోమాస చందర్ రావు, పగడాల వెంకట్ రెడ్డి, ఆకుల ప్రభాకర్ ముప్పారాపు సందీప్, పిల్లలమర్రి వేణు ,సోషల్ మీడియా నాయకులు గుడివాడ శ్రీహరి, బీసు సాంబయ్య, భూక్య రాములు పాలుగోన్నారు.





