నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎన్నికల విధానము అవగాహన కోసము పాఠశాలలో నమూనా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాసిల్దార్ ఎం ఏ ఖయ్యూం విద్యార్థుల చేత ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు , వైస్ చైర్మన్ శ్రీమతి గండ్ర రమాదేవి, కౌన్సిలర్ మేకల అనురాధ, మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు, ఉపాధ్యాయులు పొన్నం రమేష్ రవీందర్, మల్లేశం, సత్యనారాయణ, గంగ, జమున, నాగరాజు, తిరుమల, గంగాధర్, వనిత, పారుపల్లి గంగాధర్, పద్మజ, యాస్మిన్, ఫాతిమా, శ్రీకాంత్, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.





