నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా బుగ్గరాం మండలం వెల్గొండ పాఠశాలలో జెడ్ పి హెచ్ ఎస్ జాతీయ ఓటర్ దినోత్సవం ను పురస్కరించుకొని ఎన్నికల నిర్వహణ చేపట్టి విద్యార్థి నాయకులను ప్రజాస్వామ్య పద్దతి లో బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిధి శ్రీధర్ రెడ్డి ఎస్ ఐ బుగ్గరాం విచ్చేసి ఓటింగ్ సరళిని పరిశీలించి విద్యార్థులను అభినందించారు అనంతరం నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోరిక ప్రకారం బాగా చదవాలని క్రమశిక్షణ తో మెలగాలని సోషల్ మీడియా మాయ లో గాని సెల్ ఫోన్ మాయలో గాని పడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని మీ కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సేవలను త్యాగాలను గుర్తుంచుకొని బాగా చదివి మీకు ఇష్టమైన రంగంలో రాణించి సమాజం లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవలని హిత బోధ చేసారు. ప్రధానోపాధ్యాయులు. యం. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇంటివద్ద ఫోన్ తో గాని, టీవీ తో గాని సమయం గడపకుండా తల్లి దండ్రులు పర్యవేక్షించాలని మా పాఠశాలలో చదువు తో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా విద్యార్థులను తీర్చి దిద్దుతామని కావున ప్రయివేట్ కు ఫీజుల భారం భరించలేని వారు అప్పులు చేయకుండా మా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, రాజేశం, నర్సయ్య, అనిల్ కిరణ్ లు తల్లిదండ్రులు యువత గ్రామ పెద్దలు పాల్గొన్నారు.





