Saturday, March 14, 2026

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతి పొందిన కుమ్మరి పల్లి ప్రధానోపాధ్యాయుడు

నేటిసాక్షి, రాయికల్: ఈ నెల 21 నుండి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన ఆరు రాష్ట్రాల దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ప్రదర్శించిన సూపర్ సైన్స్ కిట్ ప్రదర్శనకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరి పల్లి ప్రధానోపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ బహుమతి లభించింది. అభయ్రాజ్ రూపొందించిన తక్కువ ఖర్చు మరియు ఖర్చు లేని బోధనోపకరణాలతో కూడిన సూపర్ సైన్స్ కిట్ కు ప్రత్యేక బహుమతి లభించగా పుదుచ్చేరి ఎన్ సి ఆర్ టీ డైరెక్టర్ ప్రియదర్శిని, జాయింట్ డైరెక్టర్ శివగామిల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు అభినందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News