Saturday, March 14, 2026

బాలికల ఉన్నత పాఠశాలలో ప్రేరణ కార్యక్రమం

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో, ఈ సి ఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, విద్యార్థినిలకు, ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అనే అనే అంశాన్ని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మృదుల కిరణ్ కుమార్, ఈ సి ఎస్ చంద్రశేఖరన్ దంపతులు పాల్గొన్నారు. పదవ తరగతి తర్వాత లభించే అవకాశాలు, పదవ తరగతి పరీక్షలకు విద్యార్థినీలు, ఏ విధంగా సంసిద్ధులు కావాలో తెలియజేస్తూ, విద్యార్థినులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం డాక్టర్ మృదుల కిరణ్ కుమార్ మరియు ఈసిఎస్ చంద్రశేఖరన్ దంపతులను విద్యాశాఖ అధికారి వెంకటేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యయ బృందం, విద్యార్థినిలు ఘనంగా సన్మానించడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News