Sunday, March 15, 2026

బిజెపిలో చేరిన మేయర్ సునీల్ రావు

  • మేయర్ సునీల్ రావు గంగులపై సంచలన వ్యాఖ్యలు

నేటి సాక్షి-కరీంనగర్: కరీంనగర్ మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ సునీల్ రావు కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సునీల్ రావు మాట్లాడుతూ.. గంగులపై సంచల వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నిధులు తెస్తే… ఆ సొమ్మును దండుకున్న నీచుడు గంగుల అని విమర్శించారు. నా జోలికొస్తే గంగుల కమలాకర్ అవినీతి, అక్రమాల బండారం బయటపెడతానని హెచ్చరించారు. కరీంనగర్ లో జరిగిన ప్రతి స్కాం వెనుక గంగుల కమలాకర్ ఉన్నారని ఆరోపించారు. బండి సంజయ్ నాయకత్వంలోనే కరీంనగర్ లో అభివృద్ధి జరుగుతోందన్నారు. స్మార్ట్ సిటీ నిధులు బండి సంజయ్ తెచ్చారని వాస్తవాలు చెబితే గంగులకు ఎందుకు కోపం?అని ప్రశ్నించారు. నాకు మేయర్ పదవి రావడానికి ప్రధాన కారణం వినోద్ కుమార్ అన్నారు. నాకు మేయర్ పదవి రాకుండా అడ్డుకున్నది గంగుల కమలాకరే అన్నారు. అన్ని అవమానాలు దిగమింగుకుని బీఆర్ఎస్ లో 5 ఏళ్లుగా పనిచేశాన్నారు. కరీంనగర్ లో ప్రజల సమస్యలను ప్రస్తావించినప్పడల్లా నిధులు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరుతున్నానన్నారు. చాలా మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News