Sunday, March 15, 2026

దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నది

  • జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు
  • ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ ఇ శాంభవి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 25 : వనపర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎనిమిదో వార్డ్ శ్రీనివాసపురంలో ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. ప్రాథమిక పాఠశాల స్కూల్ హెడ్మాస్టర్ ఇ.శాంభవి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్లో చదివిన విద్యార్థుల గురించి వారి వివరాలు ఆధార్ కార్డు ప్రకారంగా స్కూల్లో పేరు నమోదు చేయమంటారా లేకపోతే స్కూల్లో రికార్డు ప్రకారంగా వారి పేర్లు నమోదు చేయమంటారా అని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల పేర్లు ఒక్కసారి నమోదైతే ఫ్యూచర్లో మళ్లీ మార్చుకోవడానికి వీలు పడదని విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరించారు. స్కూల్ హెడ్మాస్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించు కోవాలని ప్రాథమిక పాఠశాల స్కూల్ హెడ్మాస్టర్ ఇ.శాంభవి పేర్కొన్నారు.శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులు,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని మన ఓటు మన హక్కు అని ఓటు ప్రాముఖ్యతపై విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ పాఠశాల ఆవరణంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాజేశ్వరి, శ్వేత మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటర్ నమోదు చేయించి, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. మీ అభిప్రాయం ప్రభుత్వానికి చేరాలంటే, పాలసీ మేకింగ్‌లో మీ వంతు పాత్ర ఉండాలంటే , ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి.ప్రజాస్వామ్యంలో ఇదే అతిపెద్ద పండుగ ఓటు హక్కు మన హక్కు అని ఓటు మన భవిష్యత్తును మారుస్తుందన్నారు.ఓటును సక్రమంగా వినియోగించుకోవాల న్నారు,ఓటు దేశ ప్రగతికి తోడ్పాటు కావాలని దేశ ప్రజలకు ప్రగతి నివ్వాలని ఉపాధ్యాయులు సూచించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యంలో ఇదే అతిపెద్ద పండుగ ఓటుకు తనదైన ప్రాముఖ్యత ఉంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అతి పెద్ద పాత్ర సాధారణ ప్రజలది అంటే ఓటరు దేవుళ్లది అని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు.ఓటు వేయడం ప్రతి బాధ్యత గల పౌరుడి హక్కు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News