
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం శివారులోని ఎస్ పి ఆర్ స్కూల్లో పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శనివారం హన్మకొండ లో ఉన్న అతిధి దివ్యాంగుల ఆశ్రమం మరియు లార్డు వృద్ధ ఆశ్రమాన్ని సందర్శించి వారి ప్రేమ సమాచారాన్ని తెలుసుకొని వారికి నిత్య ఉపయుక్త కరమైన సుమారు 50 వేల విలువైన వస్తువులు బియ్యం నిత్యవసర వస్తువులు మరియు ఇతర సామాగ్రిని పాఠశాల డైరెక్టర్ గౌరిశెట్టి జగన్మోహన్ ఆశ్రమ నిర్వాహకులైన సుజాతకు అందజేయడం జరిగింది. పాఠశాల డైరెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్వార్థం పెరుగుతున్న తరుణంలో ఆశ్రమాన్ని స్థాపించి మానసిక స్థితి సరిగా లేని పిల్లలను చేరదీసి నిస్వార్ధ దృక్పథంతో వారి బాగోగులను చూడటం చాలా అభినందనీయం నేటి విద్యార్థులు రేపటి తరాన్ని తీర్చిదిద్ది సమాజం లో బాధ్యతగా మెలుగుతూ చదువుతో పాటు పరోపకార గుణాన్ని చిన్నతనం నుండి కలిగి ఉండాలని తల్లి దండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించు కోవాలన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషగిరి రావు మాట్లాడుతూ అనాధలను మానవత్వం తో ఆదుకోవడానికి సమాజంలో దాతృత్వం గల వ్యక్తులు ముందుకు రావాలని అన్నారు తమ పాఠశాల విద్యార్థులు చిన్నతనం నుండి సేవ, దయ, గుణం అలవర్చుకొని వారి ప్యాకెట్ మనీ నుండి కొంత డబ్బులను ఇచ్చి ఇలాంటి ఊదారతను చాటుకున్నందుకు విద్యార్థులను అభినందించారు. అనంతరం హనుమకొండ లో గల లార్దు వృద్ధాశ్రమాన్ని సందర్శించి పాఠశాల డైరెక్టర్ జగన్మోహన్ ఆశ్రమ నిర్వాహకులు నారగని నరేష్ గౌడ్ ను అభినందిస్తూ ఆశ్రమానికి అవసరమైన బియ్యం నిత్యవసర వస్తువులు ఎలక్ట్రిక్ స్ట్రవ్ మరియు పాత్రలు ఇతర సామాగ్రిని అందించారు పాఠశాల డైరెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాధలుగా మార్చుకోకూడదని ముఖ్యంగా పిల్లలు దగ్గర ఉండి చూసుకోవాలని పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల వృద్ధుల పట్ల గౌరవభావం ప్రేమానురాగాలు కలిగి ఉండాలని పెద్దలు లేనిదే పిల్లల జీవన సాఫల్యం సంతృప్తికరం మనుగడ సాధ్యం కాదని పెద్దలను వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత పెద్దలకు కావలసిన మానసిక ప్రశాంతత మరియు సమయానికి కావలసిన కనీస అవసరాలను నెరవేర్చడం చివరి దశలో ప్రశాంతమైన జీవనాన్ని కోరుకోవడం జీవితాంతం తమ పిల్లలకు అవిశ్రాంతంగా పోరాటం చేసి చివర్లో ఆ పిల్లలే తల్లిదండ్రులను అనాధలుగా చేయకూడదని తెలుపుతూ ఇలాంటి ఉదారత కార్యక్రమాన్ని పిల్లల్లో ప్రోత్సహించి వారిని కార్యక్రమంలో భాగస్వాములుగా చేసిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులైన గుండు రాజబాబు, కట్కూరి వెంకట్ రెడ్డి లను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





