నేటి సాక్షి,మల్లాపూర్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా , రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు పథకాల ఎంపిక కోసం ప్రతి గ్రామంలో గ్రామసభ కార్యక్రమలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలో గత రెండురోజుల క్రితం అధికారులు గ్రామసభ నిర్వహించగా అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని కొందరు బీఆర్ఎస్ లీడర్స్ చింపివేయడంతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల మధ్యలో తీవ్రవాగ్వాదం జరిగింది.ఈ నేపథ్యంలో శనివారం ఒక పార్టీపై మరొకరు స్థానిక పోలీస్ స్టేషన్ లో పరస్పర ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పిర్యాదు చేసారు.





