Saturday, March 14, 2026

సైదాపూర్ మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ యూనియన్ సమావేశం

నేటి సాక్షి, సైదాపూర్:
సైదాపూర్ మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు తిప్పిరి శెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల ప్రధాన కార్యదర్శి సిరి రవి గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ మరియు వీడియో గ్రాఫర్స్ కుటుంబ భరోసా లో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. తదనంతరం ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిప్పిరి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ధన్యవాదాలు తెలుపుతూ సైదాపూర్ మండల ఫోటో & వీడియోగ్రఫీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని అలాగే జిల్లా కమిటీలో సభ్యత్వం తీసుకోవాలని మరియు రాష్ట్ర కమిటీ లో కూడా సభ్యత్వం తీసుకోవాలని కోరడం జరిగింది. సైదాపూర్ మండల ప్రధాన కార్యదర్శి అనగోని ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘాన్ని ఆదుకోవాలని అన్నారు. ఇట్టి సమావేశంలో గౌరవ అధ్యక్షులు; చంద రమేష్, ప్రధాన కార్యదర్శి; అనగోని ప్రణయ్, ఉపాధ్యక్షులు; గుంటి హరి కిరణ్, కోశాధికారి; బొల్లం నాగేంద్రబాబు, ముఖ్య సలహాదారు; బొడిగె చంద్రమౌళి, సహాయ కార్యదర్శి, తాటిపాముల అనిల్, ఆర్గనైజర్; అభిలాష్ మరియు సభ్యులందరూ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News