Saturday, March 14, 2026

జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవు

దశలవారీగా పోరాటలకు సిద్ధం అవుదాం…
మా ఇల్లు మాకు కావాలనే నినాదంతో మొదలు…
జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవని, ఇళ్ల స్థలాలను కాపాడుకునేందుకు దసలవారీగా పోరాటాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని టి యు డబ్ల్యూ జె (ఐజేయు) జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరు శేఖర్ పిలుపునిచ్చారు. శనివారం హుజరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నగునూరి శేఖర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇళ్ల స్థలాల పూర్తిస్థాయి కేటాయింపు కోసం పలుమార్లు కాంగ్రెస్ నాయకులతోపాటు ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వినతి పత్రం అందించి నా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. టీ యుడబ్ల్యూ పోరాటాలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, మన హక్కుల కోసం మరోసారి పోరాట బాట తప్పదని అన్నారు. స్థలాల కోసం మొదటగా సోమవారం నుంచి దశల వారి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మొదటిరోజు ఎంఆర్ఓకి వినతి పత్రం అందించడం తోపాటు మిగతా అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. అప్పటికి స్పందించకపోతే నిరసన కార్యక్రమాలతో పాటు దీక్షలు చేపడతామని, అంతటితోను సమస్య పరిష్కారం జరగకుంటే ఆమరణ దీక్ష వరకు కూడా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి, కో- కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, జిల్లా ఉపాధ్యక్షులు నంబి భరణి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుక మారి సత్యరాజ్, వేల్పుల సునీల్, సీనియర్ జర్నలిస్టులు ఆంజనేయస్వామి, కోరం సుధాకర్ రెడ్డి, మామిడి రవీందర్, కిరణ్ కుమార్ ాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News