
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం కిట్స్ వాకర్స్ ఆధ్వర్యంలో కంటి పరీక్ష, షుగర్, మరియు ఈ సీ జీ లు చెయ్యడం జరిగింది. శరత్ ఐ హాస్పిటల్ మరియు మెడకవర్ హాస్పిటల్ కలసి అందరు కిట్స్ వాకర్స్ అధ్యక్షులు నాగ మళ్ళ సుధీర్ ఆధ్వర్యం లో జరిగింది. ఈ సందర్బంగా సుధీర్ మాట్లాడుతూ ముందు ముందు కిట్స్ వాకర్స్ ఆధ్వర్యం లో చాలా కార్యక్రమాలు జరుగుతాయి కావున ప్రజలందరూ ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు నాగ మళ్ళ సుధీర్ గౌరవ అధ్యక్షులు పి. శ్రీదర్, కార్యదర్శి విజయ మోహన్, మాజీ అధ్యక్షులు పుల్ల దుర్గా రామ్, బొక్క కుమార్, కీర్తి సూరయ్య, చంద్రశేఖర్, దుబాల భాస్కర్, వి. శ్రీకాంత్, ఏ. రమేష్, యం. డి. చంద్రకర్ రెడ్డి కె. రవి, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





